Wednesday, September 5, 2012


AIPEU-POSTMAN&MTS/Gr.D - CIRCLE CONFERENCE

అఖిల భారత తపాల ఉద్యోగుల సంఘం - పోస్ట్ మాన్ & ఎం. టి. ఎస్ /గ్రూప్.డి  - ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్   రాష్ట్ర సంఘ  30వ ద్వై వార్షిక మహాసభలు  విశాఖ పట్టణం జిల్లా , సింహాచలం లో 2012, సెప్టంబర్ 2,3,4 తేదిలలో  కా|| రామ సుబ్బా రెడ్డి నగర్ , కా||టి. విష్ణు మూర్తి ప్రాంగణం లో  విజయవంతముగా నిర్వహించ బడినవి.

ఈ సమావేశములకు ముఖ్య అతిధులుగా  - శ్రీమతి కరుణా పిళ్ళై , చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, ఎ.పి సర్కిల్, శ్రీ చంద్ర ప్రకాష్, పోస్ట్ మాస్టర్ జనరల్, విశాఖపట్టణం రీజియన్, శ్రీ ఎన్నం ఉపేందర్, డి. పి .ఎస్ , విశాఖపట్టణం రీజియన్ గార్లు హాజరైనారు.

ప్రధాన ఆహ్వానితులుగా --కా|| కే. రాఘవెంద్రన్ , వర్కింగ్ ప్రెసిడెంట్ , కాన్ఫెడరేషన్, కా|| కే. వి. శ్రీధరన్, జనరల్ సెక్రటరి, గ్రూప్.సి (న్యు ఢిల్లీ ), కా|| రావి శివన్నారాయణ , అఫిషి యేటింగ్  జనరల్ సెక్రటరి, గ్రూప్. సి ( న్యూ ఢిల్లీ), కా|| ఈశ్వర్ సింగ్ దబాస్ , జనరల్ సెక్రటరి , పి -4 సంఘం (న్యూ ఢిల్లీ), కా|| ఎస్.ఎ. రహీం , జనరల్ సెక్రటరి, సివిల్ వింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (న్యూ ఢిల్లీ), కా||పి .పాండు రంగా రావు , జనరల్ సెక్రటరి, జి. డి. ఎస్ సంఘం, కా||పి .మోహన్ , జనరల్ సెక్రటరి, కాజువాల్/కంటిన్జేంట్ యూనియన్, కా||ఆర్ సీత లక్ష్మి, అసిస్టంట్ సెక్రటరి, ఎన్ .ఎఫ్ పి .యి., కా|| నిర్మల్ సింగ్ దేవ్ , సర్కిల్ సెక్రటరి, పి -4, వెస్ట్ బెంగాల్, కా||డి. బి. మొహంతి , సర్కిల్ సెక్రటరి , పి -4, ఒరిస్సా , కా||బి.ఆర్.జగదీశ్, అసిస్టంట్ జనరల్ సెక్రటరి, జి. డి. ఎస్ (సి.హెచ్.క్యు ) మొ || వారు హాజరైనారు.

మరియు, కా|| డి.ఎ.ఎస్.వి ప్రసాద్, సర్కిల్ కార్యదర్శి, గ్రూప్.సి., కా||ఆర్.జే.మధుసూదన రావు, సర్కిల్ కార్యదర్శి, ఆర్-3., ఆర్-4., అడ్మిన్.యూనియన్ ప్రతినిధులు కూడా హాజరైనారు. మహిళా కమిటి ప్రతినిధులు కా|| వర కుమారి గారు, కా|| సునీత గారు కూడా హాజరైనారు.

కా||ఎస్.దాసు గారు , రిసెప్షన్ కమిటీ జనరల్ సెక్రటరి  స్వాగతం పలుకగా, కా||జి. సాయిబాబా గారు , సి.ఐ.టి.యు రాష్ట్ర అధ్యక్షులు ప్రారంభ ఉపన్యాసము చేశారు. 

పి -4 రాష్ట సంఘానికి  "http//www.appostman.blogspot.com" అనే వెబ్ సైట్ ను కా|| ఈశ్వర్ సింగ్ దబాస్ గారు లాంచనంగా ప్రారంభించారు.

గౌ|| శాసన సభ్యులు శ్రీ మల్లా ప్రసాద్ గారు బహిరంగ సభనుద్దేశించి సందేశ మిచ్చారు.
ముఖ్య అతిధులకు, ఆహ్వానితులకు రిసెప్షన్ కమిటీ వారు ఉచిత రీతిన సన్మానము చేయడం జరిగినది.
పదవి విరమణ చేసిన కార్య వర్గ సభ్యులు -- కా||యూసుఫ్ పాషా, రాష్ట్ర సంఘ మాజీ కార్యదర్శి, కా||కే.మస్తాన్ రావు, డిప్యూటి సర్కిల్ కార్యదర్శి, కా||టి.వీర భద్రప్ప , సర్కిల్ కోశాధికారి గార్లను సర్కిల్ సంఘం తరపున ఘనంగా సన్మానించడం జరిగినది.
సబ్జెక్ట్ కమిటీ లో పలు అంశాలు, సమస్యలపై విపులముగా చర్చలు, వాదములు జరిగినవి. సభ్యుల పలు ప్రశ్నలకు సర్కిల్ కార్య దర్శి సమీక్షలో సమాధానములు చెప్పబడినవి. 

రాష్ట్ర సంఘ ద్వై వార్షిక మహా సభలలో  క్రింది కార్యవర్గాన్ని నూతనముగా ఏకగ్రీవముగా ఎన్నుకోవడం జరిగినది.

అధ్యక్షులు                -- కా||అశ్వాక్ హుస్సేన్ (సికిందరాబాద్ డివిజన్)
ఉపాధ్యక్షులు            -- కా|| వై.కోటేశ్వర రావు (విజయవాడ డివిజన్)
                               -- కా|| కే. అప్పలరాజు (విశాఖపట్టణం డివిజన్)
                               -- కా|| ఎ.రమేష్ (కరీంనగర్ డివిజన్)
సర్కిల్ కార్యదర్శి      -- కా|| ఎస్.కే.హుమాయూన్ (నెల్లూరు డివిజన్)
డిప్యూటి  స.కార్యదర్శి --కా|| పి .ఎస్.విద్యా సాగర్ (గుంటూరు డివిజన్)
అసిస్టంట్ స. కార్యదర్శి --కా||ఓం ప్రకాష్ (హైదరాబాద్ సిటీ డివిజన్)
                                 --కా||బి.ఎన్ .రెడ్డి (హైదరాబాద్ సౌత్ ఈస్ట్ డివిజన్)
                                 -- కా||సి.రంగా రెడ్డి (గుంతకల్ డివిజన్)
కోశాధికారి                  -- కా|| కే.రామ కృష్ణ  (సికిందరాబాద్ డివిజన్)
ఉప కోశాధికారి           -- కా|| జే.ధన సింగ్ (నిజామాబాద్ డివిజన్)
ఆర్గనైజింగ్ స. కార్యదర్శి - కా|| ఎన్ .వి.రత్నం (రాజమండ్రి డివిజన్)
                                  -- కా|| గిరినాదం (చిత్తూరు డివిజన్)
                                 -- కా|| ఎం.వి.వి.ఎస్.ప్రసాద్ (కాకినాడ డివిజన్)
                                -- కా|| అక్కి రెడ్డి (నంద్యాల డివిజన్)
ఆడిటర్                     -- కా|| ఎస్.ఎస్.ఆర్.ఎ.ప్రసాద్ 

ఎ.ఐ.పి .ఇ .యు -జి.డి.ఎస్ (ఎన్ .ఎఫ్.పి .ఇ ) రాష్ట్ర సంఘం తరపున శుభా కాంక్షలు, అబినందనలు తెలియ జేస్తున్నాము.

No comments:

Post a Comment