Tuesday, September 7, 2010

తేది. 07-09-2010 సార్వత్రిక సమ్మె చరిత్రాత్మకం కావాలి
సమ్మె మనకోసం.
మన ఉద్యోగాలు నిలుపుకోవడం కోసం .
మన సంస్థను ప్రైవేట్ పరం కాకుండా కాపాడుకోవడం కోసం.
మన పెన్షన్ ను నిలుపుకోవడం కోసం.
జి.డి.ఎస్ / కంటిన్జేంట్ సిబ్బంది రేగులరై జేషన్ కోసం.
జి.డి.ఎస్ పెన్షన్, మెడికల్ సౌకర్యాల కోసం.
జి.డి.ఎస్. బోనస్ పట్ల వివక్షత తొలగించడం కోసం.
ఖాళీ పోస్టుల భర్తీ కోసం.
పోస్టల్ శాఖలో ఫ్రాన్చైజింగ్, అవుట్ సోర్సింగ్ రద్దు కోసం.
అదుపులేకుండా పెరుగుతున్న ధరల నియంత్రణ కోసం.
సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం.
కార్మిక చట్టాల అమలు కోసం.
ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం గాకుండా నిలుపుకోవడం కోసం.
-- మరి చెప్పుకుంటూ పొతే యింకా అనేకం.
తేది 16-06-1992 మొదలైన సార్వత్రిక సమ్మె పరంపర 2 కోట్ల మందితో ప్రారంభమై 29-09-2008 సమ్మెనాటికి 7 కోట్లకు చేరుకోవడం - ప్రభుత్వ విధానాల పట్ల కార్మిక వర్గం వ్యతిరేకతను తెలియ జేస్తున్నది.
సమ్మె నిర్ణయం తీసుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘం చేరికతో మారు సమ్మెలోపాల్గొనేవారి సంఖ్య 8 కోట్లు దాటు తుందని అంచనా.
కార్మిక, ఉద్యోగ వర్గం ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలపై సామాన్య ప్రజానీకం అండదండలతో సమ్మెలో పాల్గొనిమన నిరసన తెలియ జేద్దాం.
సార్వత్రిక సమ్మెను చారిత్రాత్మకంగా జయప్రదం చేద్దాం.
కార్మిక వర్గ పోరాటాల బాటలో మరో మైలురాయిని అధిగమిద్దాం.

No comments:

Post a Comment