ఉగ్రవాదం కంటే ప్రమాదకరం
- కార్బైడ్ వినియోగంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలపై ఆగ్రహం
- తీసుకున్న చర్యలపై ప్రమాణ పత్రాలు దాఖలు
చేయాలని ఆదేశం
- విచారణ రెండు వారాలకు వాయిదా
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
కాయలను పండ్లుగా మాగబెట్టేందుకు కార్బైడ్ తదితర రసాయనాలు వినియోగించడం ఉగ్రవాదం కంటే ప్రమాదకరమని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ విధానంలో మాగబెట్టిన పండ్లను విక్రయిస్తున్న వ్యాపారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎపి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. 'రసాయనాల్లో కాయలను మాగబెట్టడం అంటే నిదానంగా ప్రజల్లోకి విషాన్ని ఎక్కించడమేనని, ఇది ఉగ్రవాదం కంటే ప్రమాదకర చర్య' అని హైకోర్టు తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి దిలిప్ బి బొసలే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు ఒకేసారి కాల్చి చంపితే, పండ్ల వ్యాపారులు స్లోగా ప్రజల ప్రాణాలు తోడేస్తున్నారని ఆయన వాపోయారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిని సహించవద్దని ప్రభుత్వాలను హెచ్చరించారు. తమ ఆదేశాల మేరకు తీసుకున్న చర్యలపై రెండు వారాల్లోగా ప్రమాణ పత్రాలు దాఖలు చేయాలని ఎపి, తెలంగాణ రాష్ట్రాలను ప్రధానన్యాయమూర్తి ఆదేశించారు. ఈ కేసు తదుపరి విచారణను రెండు వారాలు వాయిదా వేశారు. కాయలను మాగబెట్టేందుకు రసాయనాలు వినియోగిస్తున్నతీరుపై మీడియాలో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా స్వీకరించిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 14న హైకోర్టు ఓసారి విచారణ జరిపింది. ఇదే అంశంపై ప్రధానన్యాయమూర్తి బొసలే, న్యాయమూర్తి ఎస్‌వి భట్‌తో కూడిన ధర్మాసనం బుధవారం మరోమారు విచారించింది. పండ్ల మార్కెట్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని మునుపు జరిగిన విచారణ సందర్భంగా ఎపి, తెలంగాణ ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించిన మేరకు రెండు రాష్ట్రాలు తాము తీసుకున్న చర్యలను కోర్టుకు నివేదించారు. కోర్టు ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక జిపి రమేష్ విన్నవించారు. రసాయనాలు వాడుతున్న వ్యాపారులపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం తరపున కూడా ఆ రాష్ట్ర ప్రత్యేక జిపి సంజరు కుమార్ వాదనలు వినిపించారు. నాలుగు పండ్ల మార్కెట్లపై దాడులు నిర్వహించి నమూనాలు సేకరించామని, వాటిని ప్రయోగశాలకు పంపగా రసాయనాలు ఉన్నట్లు తేలిందని విన్నవించారు. అనంతరం ప్రధానన్యాయమూర్తి మాట్లాడుతూ పండ్ల వ్యాపారులు అత్యంత ప్రమాదకర రసాయనాల్లో కాయలను వేసి పక్వానికి తెస్తున్నారని, వాటిని తింటున్న ప్రజలు రోగాల బారినపడుతున్నారని, ప్రజల ప్రాణాలను హరించే చర్యలను సహించరాదని ఆదేశించారు. రెండు వారాల్లో ప్రమాణ పత్రాలను దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Taags :
No comments:
Post a Comment