పత్రికా ప్రకటన తే. 05.07.2012ది.
విశాఖపట్నం రీజినల్ లెవెల్ ఆందోళనా కార్యక్రమం లో భాగంగా ఈ రోజు ఒక్క రోజు ధర్నా కార్యక్రమం ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 05.00 గంటలు వరకూ విజయనగరం Superintendent of Post Offices వారి ఆఫీసు ఎదురుగా , ఈ క్రింది డిమాండ్ల పై పోస్ట్ మాస్టర్ జనరల్,విశాఖపట్నం వారి వైఖరికి నిరసన గా ధర్నా కార్యక్రమం నకు రాష్ట్ర సంఘాలు ఆదేసించినందు వలన, ఈ రోజుఅనగా తే. 05.07.2012 ది నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించటం జరిగినది. ఈ నిరసన కార్యక్రమం లో భాగంగా తే. 03.07.2012 ది నాడు నల్ల బేడ్జీ లు ధరించి విధుల కు హాజరు కావటం జరిగినది. తే. 04.07.2012 ది నాడు గేటుమీటింగులు, నినాదాలు ఇవ్వటం జరిగినది. అంతే కాకుండా తే. 06.07.2012 ది నాడు ఒక్క రోజు నిరాహార దీక్ష కార్యక్రమం ను Superintendent of Post Offices వారి ఆఫీసు ఎదురుగా చేయాలనీ నిర్ణయించడమైనది.
1. విశాఖపట్నం రీజినల్ పోస్ట్ మాస్టర్ జనరల్ వారు Rotational Transfers Guidelines ను మార్చి ఐటెం No.6 ద్వారా, పదిసంవత్సరాలు నిండని ఉద్యోగులు ను “C” class post office ల నందు సబ్ పోస్ట్ మాస్టర్లు గా నియమించ కూడదనే ఉత్తర్వులనువారు జోడించి విడులదల చేయుటను నిరసిస్తూ
2. M.V.P.Colony పోస్ట్ ఆఫీసు ఫ్రాడ్ కేసు ను CBI కి అప్పగించమని.
3. ఆదార్ కార్డ్ ల స్కాన్నింగ్ , బట్వాడా, సమాచారాన్ని పొందు పరుచట కు తగిన సిబ్బందిని మంజూరు చేయాలని
తదుపరి తే. 09.07.2012 ది నుండి తే. 12.07.2012 ది వరకూ విశాఖపట్నం నందు పోస్ట్ మాస్టర్ జనరల్,విశాఖపట్నం రీజియన్ వారి ఆఫీసు ఎదుట ధర్నా కార్యక్రమం చేయాలనీ నిర్ణయించడమైనది
No comments:
Post a Comment