సారాంశము :
గత కొద్ది రోజులుగా లండన్ నగరము లో హింస, దోపిడీ వంటి అసాంఘిక కార్య క్రమాలతో పోలిస్ అదుపులో కూడా లేకుండా పోయినట్లు వార్త. ఒక 29 సం. ఆఫ్రో-కరేబియన్ వ్యక్తిని పోలీసులు చంపడంతో మొదలైనట్లు తెలుస్తున్నది. దానితో హింస, లూటి మొ. పెచ్చరిల్లి పోయినది. మీడియా కథనము మేరకు నూతన ఆర్ధిక విధానాల అమలు చేయడం ద్వారా దేశములో నిరుద్యోగము, పేదరికము పెరగడానికి కారణాలుగా పేర్కొనబడినది. ఇటీవలి ఆర్ధిక సంక్షోభం మూలముగా పేద ప్రజలకు అందవలసిన పలు సదుపాయములలో ప్రభుత్వము కోత విధిం చినది. ఉద్యోగాలు తొలగించ బడినవి. బడ్జెట్ లో కోత వలన వేల మంది పొలిసు ఆఫీసెర్స్ కూడా నిరుద్యోగులైనారు. ప్రభుత్వానికి పోలీసులకు మధ్య సంభందాలు దెబ్బ తిన్నవి. మరియు పలు రకాల కారణాలు ప్రస్తుత పరిస్థితికి దారి తీశాయి. మరి అదే ఆర్ధిక విధానాలు అమలు జరుపుచున్న భారత దేశం లో పరిస్థితికి ఇది ఒక హెచ్చరిక.
No comments:
Post a Comment