Wednesday, June 8, 2011

WORLD'S BEST BOSS !!!!!
st1\:*{behavior:url(#ieooui) }
There were about 70 scientists working on a very hectic project. All of them were really frustrated due to the pressure of work and the demands of their boss but everyone was loyal to him and did not think of quitting their job.
One day, one scientist came to his boss and told him, "Sir, I have promised my children that I will take them to the exhibition going on in our township so I want to leave the office at 5:30 pm."
His boss replied, "OK, You're permitted to leave the office early today."
The Scientist started working. He continued his work after lunch. As usual, he got involved to such an extent that he looked at his watch only when he felt he was close to completion. The time was 8.30 PM.
Suddenly he remembered the promise he had made to his children.
He looked for his boss but he was not there. Having told him in the morning himself, he closed everything and left for home. Deep within himself, he was feeling guilty for having disappointed his children. He reached home. The children were not there.
His wife alone was sitting in the hall and reading magazines. The situation was explosive; any talk would boomerang on him. His wife asked him, "Would you like to have coffee or shall I straight away serve dinner if you are hungry?"
The man replied, "If you would like to have coffee, I too will have but what about the children?"
His wife replied, "You don't know? Your boss came here at 5.15 PM and has taken the children to the exhibition."
What had really happened was … The boss who granted him permission was observing him working seriously at 5.00 PM. He thought to himself, this person will not leave the work, but if he has promised his children they should enjoy the visit to exhibition. So he took the lead in taking them to exhibition.
The boss does not have to do it every time. But once it is done, loyalty is established. That is why all the scientists at Thumba continued to work under their boss even though the stress was tremendous.
By the way, can you hazard a guess as to who the boss was?
He was none other than the mastermind behind India's successful nuclear weapons and missiles program – Dr. APJ Abdul Kalam, Former President of India

సుమారు 70 మంది శాస్త్రవేత్తలు ఒక ప్రాజెక్ట్ పని పై ఏకాగ్రతతో పని చేస్తున్నారు. పని వత్తిడి ఎక్కువగా వున్నా బాస్ మాట కాదనలేక వుద్యోగం వదలం ఇష్టం లేక విధులు నిర్వహిస్తున్నారు. ఒక రోజు ఒక సైంటిస్ట్ వారి బాస్ వద్దకు వెళ్లి "సర్, ఈ రోజు మా పిల్లలను ఎక్సిబిషన్ కు తీసుకు వెళతానని ప్రామిస్ చేసాను, కాబట్టి 5.30 ఆఫీసు నుండి వెళ్లి పోవుటకు పర్మిషన్ యివ్వమని " అడిగారు.
బాస్ సరే అన్నారు.
ఆ సైంటిస్ట్ పని మొదలు పెట్టారు. మామూలుగానే పని ముగించి టైం చూసుకోనేప్పటికి 8.30 అయి వున్నది. అప్పుడు అతను పిల్లలకు చేసిన ప్రామిస్ గుర్తుకు వచ్చినది. తప్పు చేసినవాడిలా భాద పడుతూ ఇల్లు చేరుకున్నాడు. యింటి వద్ద పిల్లలు లేరు. భార్య ఒక్కరే వున్నారు. పరిస్థితి ఉద్విగ్నం గా వున్నట్లు భావించాడు. కాఫీ యివ్వమంటారా, లేక ఒకే సారి భోజనం వడ్డించనా అన్నది భార్య. నీకు ఇష్టమైతే కాఫీ యివ్వు అంటూ , పిల్లలు ఎక్కడ అని అడిగారు.
మీకు తెలియదా, సాయంత్రం మీ బాస్ వచ్చి పిల్లలను ఎక్సిబిషన్ కు తీసుకు వెళ్ళారు, అని బదులిచ్చినది.
జరిగినదేమిటంటే - సాయంత్రం 5.00 గంటలకు సైంటిస్ట్ గది లోనికి చూచిన 'బాస్' అతని ఏకాగ్రతకు భంగం కలిగించడం యిష్టం లేక తనే వారి యింటికి వెళ్లి వారి పిల్లలను ఎక్షిబిషన్ కు తీసుకు వెళ్ళడం జరిగినది.
ప్రతి సారి, ప్రతి ఒక్కరికి యిటువంటి సాయం 'బాస్' చేయలేక పోవచ్చు. కాని దీని వలన బాస్ పట్ల నిజాయితి పెరుగుతుంది. కాబట్టే పని వత్తిడి ఎక్కువైనా 'తుంబా' లో ఆ బాస్ క్రింద పని చేయడానికి ఎవ్వరు వెనుకాడరు.
యింతకీ ఆ 'బాస్' ఎవరో ఊహించ గలరా !!!
భారత అణు శాస్త్ర వేత్త, క్షిపణి కార్యక్రమ నిర్వాహకులు - డా. ఎ.పి.జే. అబ్దుల్ కలాం - భారత దేశ పూర్వ అధ్యక్షులు.
(సుమారు రెండు దశాబ్దాల నుండి యిటీవల వరకు పోస్టల్ డిపార్టుమెంటు లో కొత్త నియామకాలు లేక, సృష్టించ బడిన లేదా ప్రవేశ పెట్టిన కొత్త పథకాలు, పెరిగిన ప్రజా అవసరాలకు అనుగుణంగా పని భారం ఉన్నప్పటికీ, క్రింది స్థాయి ఉద్యోగి నుండి పై స్థాయి అధికారి వరకు నిబద్దత తో (రాత్రి 8.00 వరకు) పని ముగించుకొని ఇల్లు చేరుకున్న సందర్భం ప్రతి ఒక్కరి అనుభవమే. ఎవరు ఎవరికి బాస్ అయితే, యిటువంటి చిన్న చిన్న అవసరాలు తీర్చ గలరు.)

No comments:

Post a Comment