Monday, June 20, 2011

పోస్టల్ సంఘాల జాతీయ సదస్సు - చెన్నై


. 19-06-2011 డి న - ఎన్.ఎఫ్.పి.యి., మరియు ఎఫ్.ఎన్.పి.ఓ సంఘాల సర్కిల్ కార్య దర్శులు, కార్యవర్గ సభ్యులు, ప్రధాన కార్య దర్శులు, వున్నత కార్య దర్శులు తో 5-7-11 నుండి జరుగనున్న నిరవధిక సమ్మె పై జాతీయ సదస్సు నిర్వహించ బడినది. దేశవ్యాప్తంగా 22 సర్కిల్స్ నుండి సుమారు 300 పైగా ప్రతినిధులు, 18 మంది ప్రధాన కార్య దర్శులు హాజరైనారు.
కా.డి.కే.రహతే (ఎన్.ఎఫ్.పి.యి - అధ్యక్షులు), కా.టి.ఎన్.రహతే (ఎఫ్.ఎన్.పి.ఓ - అధ్యక్షులు), కా.డి.ఎన్.గిరి (ఎ.ఐ.పి.యి.డి.యి.యు - అధ్యక్షులు) కా.జి.సత్యనారాయణరెడ్డి (ఎన్.యు.జి.డి.ఎస్. - అధ్యక్షులు) అధ్యక్షతన సమావేశము నిర్వహించ బడినది. కా.డి.కే.రహతే అధ్యక్షోపన్యాసము చేయగా, కా.డి.త్యాగరాజన్ (ఎఫ్.ఎన్.పి.ఓ - సెక్రటరీ జనరల్ ) ప్రారంభోపన్యాసము చేసారు. తదుపరి కా.ఎం.కృష్ణన్ (ఎన్.ఎఫ్.పి.యి - సెక్రటరీ జనరల్ ) ప్రసంగించారు. ప్రస్తుత డిపార్టుమెంటు పరిస్థితి, సమ్మె ఆవశ్యకత, పాలసీల ప్రభావము, వుద్యోగుల కర్తవ్యము, యిటీవల జరిగిన చర్చల సారాంశము , భవిష్యత్ కార్యా చరణ, సమ్మె కోన సాగించవలసిన తీరు మొదలగు అనేక విషయాలపై విపులంగా విశదీకరించడం జరిగినది. జి.డి.ఎస్ సంఘాల ప్రతినిధులుగా కా.ఎస్.ఎస్.మహాదేవయ్య (ప్రధాన కార్య దర్శి), కా.గౌతం (ఎన్.యు.జి.డి.ఎస్ - సహాయ ప్రధాన కార్యదర్శి) జి.డి.ఎస్ సమస్యల పరిష్కారము కొరకు సమ్మె ఆవశ్యకతను వివరించారు. కా.కే.రాఘవెంద్రన్ (పూర్వ సెక్రటరీ జనరల్ - ఎన్.ఎఫ్.పి.యి ), వర్కింగ్ ప్రెసిడెంట్ - కాన్ఫెడరేషన్ కూడా హాజరై ప్రసంగించారు. సమ్మె తోలి రోజున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ సమ్మె కు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించుట, 4 వ రోజున అన్ని చీఫ్ పి.ఎం.జి కార్యాలయాల ఎదుట కేంద్ర పభుత్వ వుద్యోగులచే ఒక రోజు ధర్నా నిర్వహించుట - కాన్ఫెడరేషన్ తరపున నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుమారు 40 మందికి పైగా ప్రతినిధులు సమ్మె పై వివరంగా తమ అభిప్రాయాన్ని, సానుకూలతను వ్యక్తపరిచారు. రెండవ అభిప్రాయము లేకుండా నిరవధిక సమ్మె కు సంసిద్దత వ్యక్తం చేశారు. భారతీయ ఫెడరేషన్ కూడా 6-7-11 తేది నుండి సమ్మె చేయనున్నట్లు నోటీసు జారి చేసినట్లు తెలియజేయబడినది. అన్ని రకాల ప్రయత్నాలతో సమ్మె ఆవశ్యకతను , డిమాండ్ల ప్రాధాన్యతను దేశ ప్రజలందరికి తెలియజేసే విధముగా కార్యక్రమాలు నిర్వహించ వలసినదిగా కా.కృష్ణన్ తెలిపారు. జాతీయ సదస్సు లో వెలువడిన అందరి అబిప్రాయాలకు అనుగుణంగా "డిక్ల రేషన్" ప్రతిపాదించబడి ఏక గ్రీవంగా ఆమోదించ బడినది. ....ఆంధ్ర ప్రదేశ్ సర్కిల్ నుండి ఎన్.ఎఫ్.పి.యి., ఎఫ్.ఎన్.పి.ఓ ప్రతినిధులుగా 20 మంది హాజరైనారు. 8 మందిప్రసంగించారు. ....చెన్నై, టి.నగర్, శ్రీ పద్మం కళ్యాణ మండపం లో, తమిళ నాడు తపాల ఉద్యోగ సంఘాల ఆతిధ్యములో తపాల ఉద్యమ చరిత్రలో మొదటి సారిగా యిటువంటి సదస్సు విజయవంతంగా, ఘనంగా నిర్వహించ బడినది.

No comments:

Post a Comment