Thursday, June 2, 2011

కథల చందమామ - చిన్నారుల మేనమామ "నారంసేట్టి"
శ్రీ నారంసేట్టి ఉమామహేశ్వర రావు ఇన్స్పెక్టర్ పోస్ట్స్ కాకినాడ డివిజన్ చక్కటి రచయత మరియు తెలుగు సాహితి ప్రపంచం లో అతని పేరు సుపరిచితం. ఇప్పటికి ఐదువందలకు పైగా ఆయన కలం నుంచి వెలువడిన కథలు వివిధ పత్రికలలో ప్రచురితమైనవి. బాలల కధలు చక్కటి సరళమైన బాషతో సందేశాత్మకంగా మరియు ఆసక్తికరంగా వ్రాయటంలో దిట్ట. నిన్నటి "మేలేరిగిన మనిషి" కాని నేటి "వింత జలం" కాని ఆయనలోని సృజనాత్మక రచనా శైలికి దర్పణం. వృత్తి వత్తిడులను అధిగమించి తను కొనసాగిస్తున్న రచనా వ్యాసంగం మిక్కిలి ముదావహం. మన సంఘ సభ్యుడుగా మనందరికీ గర్వకారణం. తన రచన వ్యాసంగాన్ని గుర్తుంచి బాలసాహిత్య పరిషత్ హైదరాబాద్ వారు మే నెల ఎనిమదవ తారీకున త్యాగరాయ గాన సభ లో జరిగిన కార్యక్రమం లో "బాల సాహిత్య రత్న" విశిష్ట పురస్కారము ౨౦౧౧ తో సత్కరించినారు. "వింత జలం" బాలల కథల సంపుటి మన పిల్లలే కాకుండా మనందరం కూడా చదవటానికి మిక్కిలి ఆసక్తి కరమైన అంశాలతో రూపొందించిన ఇరవైరెండు కథల సమాహారం. ప్రతులు పొందుటకు సంప్రదించ వలసిన ఫోన్ నంబర్లు : 9490799203,9032639671

No comments:

Post a Comment